పద్మనాయక వెలమల ఆవిర్భావం
పద్మనాయకులు ఎటుల జన్మించారో తెలపడానికి కొన్ని కథలు ఉన్నాయి . అవి ముఖ్యంగా మూడు . కానీ ఈ గాథలు వేటికీ కూడా చారిత్రక ఆధారాలు లేవు . కానీ ఇతిహాసం ఉన్నపుడు దానిని చెప్పాలి . అందుకే ఆ మూడు కథలు కింద క్లుప్తంగా ఇస్తున్నాను . దానిలో మొదటి దాని ప్రకారం పద్మనాయకులు క్షత్రియులు అని , పరశురాముడు క్షత్రియులు అందరిని నిర్జిస్తుండగా వారు తమ జంధ్యాలు తీసివేసి తాము పద్మనాయకులు అని చెప్పుకుని దక్షిణా పథానికి వచ్చారు అని అంటారు . రెండవ దాని ప్రకారం పద్మనాయకులు మహాపద్మ నందుడు కి ఒక శూద్ర స్త్రీతో జన్మించినవారు అని , మహాపద్మ నందుడిని చంద...