పద్మనాయక వెలమల ఆవిర్భావం

పద్మనాయకులు ఎటుల జన్మించారో తెలపడానికి కొన్ని కథలు ఉన్నాయిఅవి ముఖ్యంగా మూడుకానీ  గాథలు వేటికీ కూడా చారిత్రక ఆధారాలు లేవు

కానీ ఇతిహాసం ఉన్నపుడు దానిని చెప్పాలిఅందుకే  మూడు కథలు కింద క్లుప్తంగా ఇస్తున్నాను

దానిలో మొదటి దాని ప్రకారం పద్మనాయకులు క్షత్రియులు అనిపరశురాముడు క్షత్రియులు అందరిని నిర్జిస్తుండగా వారు తమ జంధ్యాలు తీసివేసి తాము పద్మనాయకులు అని చెప్పుకుని  దక్షిణా పథానికి వచ్చారు అని అంటారు

రెండవ దాని ప్రకారం పద్మనాయకులు మహాపద్మ నందుడు కి ఒక శూద్ర స్త్రీతో జన్మించినవారు అనిమహాపద్మ నందుడిని చంద్రగుప్త మౌర్యుడు ఓడించిన తరువాత వీరిని కూడా చంపడానికి  వెంట పడగా వారు దక్షిణా పథానికి వచ్చి పద్మనాయకులు అయ్యారు అని అంటారు.  

మూడవ దాని ప్రకారం పద్మనాయకులు కొండ అవతల (అంటే వింధ్య పర్వతాల అవతలనివసించేవారనివారిని వింద్జ్య పర్వతాల అవతల నుండి దక్షిణా పథానికి బహిష్కరించడం వలన అక్కడికి వలస వచ్చి వెలమలు (వెలి అంటే కొండమల అంటే అవతల అంటే కొండ అవతలఅయ్యారు అని అంటారు

మన దగ్గర చారిత్రక ఆధారాలు లేకుండా  విషయం నమ్మడానికి లేదుఅందుచేత  మూడు కూడా నమ్మటం సరి కాదు.   

కానీ  మూడు ఇతిహాసాలు కూడా వెలమలు ఉత్తర భారత దేశం నుండి వచ్చినవారు అని సూచిస్తున్నాయిఅంటే బహుశా అది నిజం కావడానికి ఆస్కారం ఉందికానీ అది కూడా మనం నిశ్చితంగా చెప్పలేము

 వెలమ కులాల మూలాన్ని ఖచ్చితత్వంతో నాటి చెప్పలేము కాని వెలమల గురించిన మొదటి ప్రస్తావన కొండవీడులోని పెదకోమటి వేమారెడ్డి ఆస్థాన కవి శ్రీనాథునిపల్నాటి వీరచరిత్రలో జరిగిందిపల్నాటి యుద్ధం క్రిస్తు శకం 1178 -82  మధ్యలో జరిగిందిఅందులో బ్రహ్మనాయుడు రేచెర్ల గోత్రజుడైన వెలమ దొర  అని చెప్పబడింది. 

శ్రీనాథుడు 1365-1441 సంవత్సరాలలో జీవించాడు, అయితే వాస్తవానికి పల్నాటి యుద్ధం యుద్ధం 1178 మరియు 1182 సంవత్సరాల మధ్య ఎక్కడో జరిగింది. అంటే కవి తన కాలానికి 200 సంవత్సరాల కంటే ముందు జరిగిన దాని గురించి వ్రాసాడు. 

తరువాత క్రిస్తు శకం 1199 లో రాజ్యానికి వచ్చిన గణపతిదేవుని కొలువులో పద్మనాయక వెలమలు ముఖ్య పాత్ర పోషించారు. 

అలాగే వారు  ఆయన వారసులు ఐన రుద్రమదేవి, ప్రతాపరుద్రుని కొలువులో ముఖ్యపాత్రలు పోషించారు. వారు కాకతీయ సామ్రాజ్య విచ్చిన్నం తరువాత నల్గొండ లోని రాచకొండ రాజధానిగా చేసుకుని స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించారు.     

పద్మనాయకులు నల్గొండ జిల్లాలోని పిల్లలమఱ్ఱి ఆమనగల్లు ప్రదేశాల వారువారే కాకుండారెడ్లు కూడా అదే ప్రదేశానికి చెందినవారు

పల్నాటి యుద్ధం ముందు కాలంలో ఉండిన వెలమల గురించి కొన్ని ఊహా గానాలు ఉన్నాయికానీ మళ్ళీ మరల వాటికి కూడా ఏమీ చారిత్రక ఆధారాలు లేవు

పల్నాటి యుద్ధనికి ముందు మనకు రెండు చారిత్రక దృష్టాంతారాలు  మట్టుకు దొరుకుతాయిఅవి ఏమిటంటే నలగామరాజు (పల్నాటి యుద్ధం ఫేమ్)  పిలుపున కాకతీయ రాజు ఐన కాకతి రుద్రదేవుడు( 1163 -1195 )  తన సైన్యంతో మల్యాలకొమరవెల్లివిప్పర్ల  మరియు నతవాది నాయకులను తీసుకుని సైన్యంతో  కోట నాయకుడు ఐన దొడ్డ భీముడిని జయించి ధరణికోటను అతడి నుండి స్వాధీనం చేసుకున్నాడు అని ఉందిమల్యాల మరియు విప్పర్ల రెండు కూడా పద్మనాయక వెలమ గోత్రాలే

అంతే కాకుండా పల్నాటి యుద్ధం ముందు ఉన్న వెలనాటి గొంకరాజు మంత్రి దొడ్డ నాయుడు(బ్రహ్మనాయుడి  తండ్రి)  రేచెర్ల పద్మనాయకుడుఆంటే అప్పటికే పద్మనాయకులు స్థిరపడి నాయక లక్షణాలు కలిగి ఉన్నారుఅది కేవలం ఒక తరం లో అయ్యే పని కాదుదానిని బట్టి అంతకు ముందు కూడా పద్మనాయకులు స్థిరపడి ఉన్నారు ఉన్నారు అని మనకు తెలుస్తుందికానీ దానికి ఏమీ చారిత్రక ఆధారాలు మట్టుకు లేవు.    

పల్నాటి యుద్ధం తరువాత గణపతిదేవుని పరిపాలనలో మళ్ళీ మనకు పద్మనాయకులు తగులుతారుమొదటిగా రేచెర్ల రుద్రుడుఆయన గణపతిదేవుని   ముఖ్య సేనాధిపతికానీ అయన పద్మనాయకుడా లేక రెడ్డి నా అన్నది స్పష్టంగా తెలియదు కానీ ఎక్కువ మంది చరిత్రకాలు అయన  రెడ్డి అనే నమ్ముతారు.  

కానీ వెలుగోటివారి వంశావళి లో ఆయన పద్మనాయకుడు అని చెప్పబడింది.  రెడ్ల లో కూడా రేచెర్ల గోత్రం ఉందిపైగా దానికి తోడు వారు కూడా పద్మనాయకుల లాగే నల్గొండ లోని పిల్లలమఱ్ఱిఆమనగల్లు ప్రదేశం నుండి వచ్చినవారేకానీ రేచెర్ల రుద్రుడు రెడ్డి అని చెప్పడానికే ఎక్కువ ఆస్కారం ఉంది ఎందుకంటే ఒక శాసనంలో అయన వంశాన్ని చెప్తూ అయన పూర్వీకులను అందరిని రెడ్డి నామంతో చెప్పారు. వెలమలు ఎవ్వరూ కూడా రెడ్డి నామం ధరించారు అనడానికి మనకు ఒక్క ఉదాహరణ కూడా లేదు

మనకు కాకతీయ సామ్రాజ్యంలో అందరు చరిత్రకారులు అంగీకరించే పద్మనాయకులు గణపతిదేవుని కాలం లోనే తగులుతారుఅందులో మొట్ట మొదటి వాడు ఎర దాచానాయకుడుఆయన తరువాత దామరుద్రప్రసాదిత్యనాయకులువీరు అందరూ గణపతిదేవుని (1199 -1262 )  సైన్యాధిపతులు.  

కాకతీయ రాజ్య పతనం అనంతరం రాజ్యం అంతా మహమ్మద్ బీన్ తుగ్లక్ అధీనం అయ్యిందిఅయన దాన్ని పాలించడానికి ఓరుగంటిలో ఒక సైన్యాధిపతి ని నియమించాడుఆంధ్ర దేశం అంతా ముస్లిం పాలన లో అల్ల కల్లోలం అయిపొయింది.  



Comments

Popular posts from this blog

పద్మనాయకులు-రాచకొండ దేవరకొండ రాజ్య చరిత్ర

పద్మనాయక గోత్రనామాలు