పద్మనాయక వీరుడు గజరావు తిప్పన.

 పద్మనాయక చరిత్రకారులు అందరూ 14 -15   శతాబ్దాలలో రాచకొండ దేవరకొండ సామ్రాజ్యాల గురించి మాత్రమేచెప్పారుఅవి కాక ఇంకా పద్మనాయక రాజ్యాలు ఏమైనా ఉన్నాయా అని నాకు సందేహం వచ్చింది.

పద్మనాయక రాజ్యాలకు రెడ్డి రాజ్యాలకు బద్ధ వైరం.  వైరం అవి రెండూ అంతం అయ్యేవరకు కొనసాగిందిఅందుచేత రెడ్డి రాజ్యాలు గురించి తెలుసుకుంటే పద్మనాయక చరిత్ర గురించి ఏదైనా కొత్తగా తెలుస్తుందేమో అనిపించింది నాకు.

 ఉద్దేశం తో నేను రెడ్డి రాజ్యాలు గురించి చదివానుపద్మనాయకుల లాగే రెడ్లు కూడా యుద్ధ వీరులువారు ముందు వ్యవసాయం చేసుకునే వారే అయినా పరాక్రంలో వారు పద్మనాయకులకు ఏమి తీసిపోరుదానికి తోడు వారు విజయనగర చక్రవర్తి హరిహరరాయల కుటుంబంతో వివాహ సంబంధాలు కూడా నెలకొల్పుకున్నారు.  

అసలు రెడ్లు ఎక్కడివారుకొండవీడురాజమహేంద్రవరం ఏలిన రెడ్డి రాజులు పాకనాడు(ఇప్పటి కడపనెల్లూరు మరియు దక్షిణ ప్రకాశం జిల్లాలునుండి వచ్చిన వారే.  

పద్మనాయకులకు రెడ్లకు వైరం రావటానికి కారణం రేచెర్ల సింగమనాయకుడు జల్లిపల్లి ముట్టడిలో సోమవంశ క్షత్రియులచే కుతంత్రంతో చంపబడటం కుట్రలో రెడ్లు కూడా సోమవంశ క్షత్రియులకు సాయం చేసారుదానితో  రెండు రాజ్యాల  మధ్య వైరం మొదలయ్యి రెడ్డి రాజ్యాలు రెండూ క్రిస్తు శకం 1448 లో అంతరించేవరకు కొనసాగింది

అందులో కొండవీడు రెడ్డి రాజ్యం క్రిస్తు శకం 1424  లో అంతం అవగారాజమహేంద్రవరం రెడ్డి రాజ్యం 1448  లో అంతరించిందిఅప్పటికి పద్మనాయకులు రాచకొండ రాజ్యాన్ని కోల్పోయి కేవలం దేవరకొండ రాజ్యాన్ని కలిగి ఉన్నారుఅది కూడా ఒరిస్సా కపిలేశ్వర గజపతి కి సామంత రాజ్యం అయిపోయిందిదేవరకొండ రాజ్యం కూడా చివరకు క్రిస్తు శకం 1475  లో అంతరించింది.

రెడ్డి రాజ్యాల గురించి చదివినపుడు నాకు తెలిసిన కొత్త విషయం ఏమిటంటే కుమారగిరి రెడ్డి సామంతరాజు  లో ఒకడు పద్మనాయకుడు అయిన వెలుగోటి రాయపనాయకుడుమరి ఈయన వెలుగోటి వంశస్థులైన వేంకటగిరి వారికి బంధువు ఏమో మనకు తెలియదుఈయన గుంటూరుబాపట్ల మరియు పల్నాడు ప్రాంతంలో పరిపాలించాడుఈయన సామంతుడే గజరావు తిప్పన. 

క్రిస్తు శకం 1396  లో బహమనీ సుల్తాన్ ఫిరోజ్ షా కొండవీడు రాజ్యాన్ని ముట్టడించగా కొండవీడు తరఫున గజరావు తిప్పన ఆయనను ఖమ్మంమెట్ దగ్గర ఓడించాడు.

రెడ్డి రాజ్యంలో అంతర కలహం అయ్యి సింహాసనం కోసం కుమారగిరి రెడ్డి మరియు పెదకోమటివేమా రెడ్డి దెబ్బలాడారుఅందులో రాయపనాయకుడు పెదకోమటివేమా రెడ్డి పక్షం వహించాడుఅంతర్యుద్ధం లో పెదకోమటివేమా  రెడ్డి విజయం సాధించి రాజు అయ్యాడు.  

రాజమహేంద్రవరం రెడ్డి రాజు అయిన కాటయవేమా రెడ్డి కుమారగిరి ని సమర్ధించాడుపెదకోమటివేమా రెడ్డి రాజరికాన్ని అయన అంగీకరించలేదుతన సైన్యంతో అయన కొండవీడు ను ముట్టడించారుఅప్పుడు పెదకోమటివేమా రెడ్డి  పక్షం నుండి మరల గజరావు తిప్పన కాటయవేమారెడ్డి ని గుండుగొలనుకోసూరు యుద్ధాలలో ఓడించాడు.

కాటయవేముని కి విజయనగర హరిహర రాయలకు బంధుత్వం ఉందిఅందుచేత హరిహరరాయలు కాటయవేమునికి సాయంగా కొండవీడు ను ముట్టడించడానికి ఛౌన్ద ( Chounda)  సేనాని ని పంపాడుఅప్పుడు గజరావు తిప్పన ఛౌన్ద సేనాని ని కూడా ఓడించాడు.     

అన్ని యుద్ధాలలో గజరావు తిప్పన విజయం సాధించాడు అంటే అయన మహావీరుడు  అయ్యి ఉండాలిదానికి తోడు పద్మనాయక రాజ్యాలకు రెడ్డి రాజ్యాలకు బద్ధ వైరంఅంటే కొన్ని యుద్ధాల్లో అయినా గజరావు తిప్పన పద్మనాయక రాజ్యాలకు విరుద్ధంగా పోరాడి ఉండాలి వివరాలు మనకు తెలియవు.


Comments

Popular posts from this blog

పద్మనాయక వెలమల ఆవిర్భావం

పద్మనాయకులు-రాచకొండ దేవరకొండ రాజ్య చరిత్ర

పద్మనాయక గోత్రనామాలు